ట్రంప్ 100% ట్యాక్స్.. భారత్‌కు కొత్త టెన్షన్!

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు ట్యాక్స్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లభించింది. దీంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపితే, ఇతర దేశాల నుంచి ఖరీదైన క్రూడ్ ఆయిల్ కొనాల్సి రావచ్చు. దాంతో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికాకు వస్తువులు ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై ప్రభావం పడొచ్చు. భారత్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు.


