← Back to news

అరకులోయలో ముమ్మర వాహన తనిఖీలు..!

By B V Appalanaidu· 1d ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని చొంపి జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు వాహనాలను క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులపై హెల్మెట్, డాక్యుమెంట్స్, ట్రిపుల్ రైడ్ కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో పీసీ రామరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి తనిఖీలు రోజూ జరిగితే బాగుంటుందని స్థానికులు అంటున్నారు.

More in Local