← Back to news

తండ్రీకొడుకులకు భారత్ కళా పురస్కార్

By Srikanth Goud· 2h ago· Jagitial, Jagitial, Jagitial
తండ్రీకొడుకులకు భారత్ కళా పురస్కార్

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఫొటోగ్రాఫర్ వడ్లూరి రవీందర్, ఆయన కుమారుడు సాత్విక్ వడ్లూరికి భారత్ కళా పురస్కార్ అవార్డులు లభించాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో ఫొటో పరివార్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటో ట్రేడ్ షోలో వారు అవార్డులు అందుకున్నారు. రవీందర్‌కు బెస్ట్ ట్రెడిషనల్ ఫొటోగ్రాఫర్‌గా, సాత్విక్‌కు బెస్ట్ క్యాండిడేట్ ఫొటోగ్రాఫర్‌గా పురస్కారాలు దక్కాయి. ఒకే వేదికపై తండ్రీకొడుకులు అవార్డులు అందుకున్నారు.

More in Local