← Back to news

రాజుపేటలో బతుకమ్మ సెలబ్రేషన్స్

By Ramesh· 3h ago· Warangal

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేటలో సూర్యోదయ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ కల్చర్‌కు ప్రతీక అయిన ఈ పండగను అందరూ ఆనందంగా జరుపుకున్నారు.

More in Local