పులివెందులలో కాల్పుల కలకలం.!

AP: కడప జిల్లా, పులివెందులలో అర్థరాత్రి కాల్పుల కలకలం రేగింది. వినాయక విగ్రహం దగ్గర పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తనను సన్మానించలేదని పుష్పనాథ్‌ను విజయ్ నిలదీశారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. అక్కడే ఉన్న హజ్ కమిటీ డైరెక్టర్ మా భాషా గన్ మెన్.. గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఆగ్రహంతో పుష్పనాథ్ వర్గీయులు వెళ్లి.. విజయ్ ఇంటి దగ్గర ఉన్న మూడు వాహనాల్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది.


