← Back to news

లివర్‌ క్యాన్సర్‌పై పసుపు, మిరియాల ఎఫెక్ట్

By Sharmila· 1d ago· Indiatimes
లివర్‌ క్యాన్సర్‌పై పసుపు, మిరియాల ఎఫెక్ట్

TG: హైదరాబాద్‌ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో పసుపుపై పరిశోధకులు రీసెర్చ్ చేశారు. ఈ పరిశోధనలో పసుపులోని కర్కుమిన్, బ్లాక్ పెప్పర్‌లోని పైపెరిన్ లివర్ నష్టం, వాపు, క్యాన్సర్‌కు సంబంధించిన మార్పులను తగ్గించినట్లు వెల్లడైంది. వీళ్ళు 30 ఎలుకలపై 20 వారాల పాటు చేసిన రీసెర్చ్‌లో 2 పదార్థాల కలయిక మెరుగైన ఫలితాలను ఇచ్చిందని తేలింది. అయితే, ఈ రిజల్ట్ ఎలుకల్లో మాత్రమేనని, మనుషుల్లో లివర్ క్యాన్సర్‌ను నివారించడానికి ఉపయగపడతాయని ఇంకా నిర్ధారణ కాలేదు.

More in Health