19 అడుగుల కొండచిలువతో ఫైట్.. వైరల్ వీడియో!
19 అడుగుల భారీ కొండచిలువతో ఫైట్ చేసి చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మైక్ హోల్స్టన్ అలియాస్ ‘ది రియల్ టార్జాన్’ <a href="https://www.instagram.com/reels/DeYaOb6B1sL/">వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో</a> వైరల్ అవుతోంది. దాదాపు 90 కిలోల బరువున్న కొండచిలువను కంట్రోల్ చేయబోయిన మైక్ను పాము చుట్టేసింది. కాళ్లు, నడుము చుట్టూ బలంగా బిగించి ఊపిరాడకుండా చేసింది. చివరికి ఎంతో కష్టపడి దాని పట్టు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఫైట్ తన జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైనదని మైక్ చెప్పాడు.
