రోడ్లపై రంగులెందుకు? కోల్కతాలో చర్చ!
దుర్గాపూజ సందర్భంగా కోల్కతాలోని గరియాహాట్ ఫ్లైఓవర్పై వేసిన పెయింట్ వివాదానికి దారితీసింది. వర్షం పడిన టైంలో రోడ్డు జారడంతో బైకర్లు అదుపుతప్పి కిందపడిన వీడియో వైరల్గా మారింది. పెయింట్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించడంతో సివిక్ బాడీ దాన్ని తొలగిస్తోంది. రోడ్లపై అసలు రంగులు వేయడం ఎందుకంటూ.. ఫ్లైఓవర్ల అందం కోసం వేసిన రంగులే వాహనదారుల భద్రతకు ముప్పుగా మారడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.