← Back to news

దబ్బిర్‌పేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

By ibrahim sulthana· 24 Aug 2026
దబ్బిర్‌పేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

TG: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు కొత్త భరోసా లభించింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బిర్‌పేట గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా మంజూరైన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో కార్డులు మంజూరైనట్లు నాయకులు తెలిపారు. సర్పంచ్ ధనసరి సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రవి, ఉపసర్పంచ్ రవీందర్‌రావు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కార్డులు అందజేశారు.

More in Local