భర్త కాదు యముడు.. పెళ్లైన 6 నెలలకే..!

TG: హైదరాబాద్.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో దారుణ ఘటన జరిగింది. భర్తే, భార్యను హత్య చేశాడని తెలిసింది. 6 నెలల కింద పరశురామ్, శివానీకి పెళ్లి జరిగింది. గర్భం దాల్చినప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె తన వల్ల ప్రెగ్నెంట్ అవ్వలేదని పదే పదే అనుమానిస్తూ.. చివరకు గర్భవతిగా ఉన్న భార్యను గొంతు నులిమి చంపేశాడని తెలిసింది. ఈ ఘటనపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


