← Back to news

150 కిలోల పసుపు కొమ్ములతో గణపతి

By BK· 2h ago· విజయనగరం
150 కిలోల పసుపు కొమ్ములతో గణపతి

విజయనగరం జిల్లా రాజాం మండలం బద్దం గ్రామంలో చాలెంజ్ యూత్ ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చారు. ఎలాంటి కెమికల్స్ వాడకుండా 21 రోజులు కష్టపడి 150 కిలోల పసుపు కొమ్ములతో 15 అడుగుల వినాయకుడిని రెడీ చేశారు. పూర్తిగా ఎకో-ఫ్రెండ్లీగా ప్రకృతిసిద్ధంగా తీర్చిదిద్దిన ఈ పసుపు గణనాథుడు ఇప్పుడు వినాయక చవితి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. యూత్ చేసిన ఈ కొత్త ఆలోచనను ఊరి జనాలు మెచ్చుకుంటున్నారు.

More in AP