ఫ్రిజ్ పైన వస్తువులు పెడుతున్నారా?

చేతికి అందుబాటులో ఉంటుందని చాలామంది ఫ్రిజ్ పైన రకరకాల వస్తువులను ఉంచుతుంటారు. అలా పెట్టడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫినాయిల్స్, యాసిడ్లు, బ్లీచింగ్ ప్రొడక్ట్స్ వంటి రసాయనాలు ఫ్రిజ్‌పై పెడితే అవి లీకై అగ్నిప్రమాదాలకు దారితీసే ప్రమాదముంది. వంటనూనెలు, పండ్లు ఉంచితే ఫ్రిజ్ వేడికి వాటి రుచి, వాసన పాడవుతాయి. వీటితో పాటు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, పేపర్లు, బరువైన సామాగ్రిని అసలు పెట్టకూడదు. అందుకే ఫ్రిజ్ పైభాగాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచడమే సురక్షితం.



