'ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు'

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయనున్నట్లు తహశీల్దార్ కౌలేష్ తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వరకు నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ, 27న తుది జాబితా ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో నిబంధనలు పాటించాలని, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.



