కిడ్నాప్ చేసి డబ్బులు నొక్కేసిన ఇద్దరు అరెస్ట్
శ్రీకాకుళం పలాస వద్ద నేషనల్ హైవే-16పై యాక్సిడెంట్ డ్రామా ఆడి, ఒకరిపై దాడి చేసి కిడ్నాప్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి నుంచి ₹88,550 ట్రాన్స్ఫర్ చేయించుకున్న కిర్రి సాయికృష్ణ, గొర్లె రవితేజల నుంచి ఆటో, బైక్, ఫోన్లు, ₹18,550 స్వాధీనం చేసుకున్నట్లు DSP రమణ తెలిపారు.


