← Back to news

వాగులు పొంగి.. రోడ్లపైకి వరద నీరు

By MD ALI· 1d ago· Chinturu, Polavaram

AP: పోలవరం జిల్లాలోని పలు మండలాల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి వరద నీరు వస్తుండటంతో గోదావరి, శబరి నదుల నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లోని పలు వాగులు పొంగిపొర్లుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చింతూరు మండలంలో సోకిలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ రహదారిపై సుమారు 10 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో చింతూరు–వీఆర్ పురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

More in National