రూల్స్ కాగితాల్లోనే.. రోడ్లపై మాత్రం ప్లాస్టిక్ వరద!

AP : శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస పట్టణాల్లో ప్లాస్టిక్ నిషేధం పేరుకే పరిమితమవుతోంది. జిల్లాలోని నాలుగు టౌన్లలో రోజుకు వచ్చే 155 మెట్రిక్ టన్నుల చెత్తలో దాదాపు 17.5 మెట్రిక్ టన్నులు ప్లాస్టికే ఉంటోంది. చిన్న షాపుల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు అంతటా కవర్లు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రతి నెలా 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' ప్రోగ్రామ్ చేస్తున్నా, అధికారులు సరిగ్గా తనిఖీలు చేయకపోవడం వల్లే ప్లాస్టిక్ వాడకం ఆగడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.


