యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'కు 14 రోజుల రిమాండ్!
ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయనపై UAPA చట్టం కింద దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం సెక్యూరిటీ రీజన్స్ వల్ల పోలీసులు ఆయనను నెల్లూరు సబ్ జైలుకు షిఫ్ట్ చేశారు. ఈ అరెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.