← Back to news

టైరు పేలడంతో అదుపుతప్పిన కారు

By Repalle Rajesh· 1d ago· Rajoli, Rajoli, Jogulamba Gadwal
టైరు పేలడంతో అదుపుతప్పిన కారు

జోగులాంబగద్వాల జిల్లా నారాయణపురం స్టేజీ సమీపంలో మంగళవారం కారు టైరు పేలడంతో ప్రమాదం జరిగింది. మక్తల్ నుంచి అలంపూర్ ఆలయ దర్శనానికి వెళ్తున్న కారులో అనిల్ కుమార్ (38), శిరీష (31), పిల్లలు వేదన్ (5), వినయ వాసిని (2) ఉన్నారు. ఈ ప్రమాదంలో వేదన్‌కు తీవ్ర గాయాలు కాగా, మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మనోపాడు 108 సిబ్బంది EMT రేణుక, పైలట్ ప్రేమానందం ప్రథమ చికిత్స అందించి క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

టైరు పేలడంతో అదుపుతప్పిన కారు
టైరు పేలడంతో అదుపుతప్పిన కారు

More in Local