నేడు ఢిల్లీకి రేవంత్.. పెద్ద ప్లానే!

TG: CM రేవంత్ వీలైనప్పుడల్లా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ టూర్లపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, ఆయన వెళ్తూనే ఉన్నారు. నిన్న కాంగ్రెస్ MPలు రాహుల్, ప్రియాంకను పోలీసులు డిటైన్ చేసి, రిలీజ్ చెయ్యడంతో.. వారికి సపోర్టుగా ఇవాళ రేవంత్ ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉండగా.. వాటిని పట్టించుకోకుండా ఈ టూర్లేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రేవంత్ మాత్రం నిరంతరం హైకమాండ్‌తో టచ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.