40 ఏళ్ల అనుభవం.. 55 నిమిషాల ఫీలింగ్
TG: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్.. తన సర్వీస్‌లో చివరి సార్టీని మంగళవారం తెలంగాణలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కిరణ్ ఫ్లైట్‌లో పూర్తి చేశారు. 40 ఏళ్ల కిందట 1984 జనవరి 28న ఇక్కడే తన ఫస్ట్ ఫ్లైట్ నడిపారు. ఇప్పుడు ఇన్‌స్ట్రక్టర్, రిటైర్డ్ వింగ్ కమాండర్ VS కోచ్చర్‌తో కలిసి ఈ 55 నిమిషాల ప్రయాణాన్ని పూర్తిచేశారు. “ఇది కలలా ఉంది. నేను మొదలుపెట్టిన అదే విమానంతో ముగించాను” అని సింగ్ అన్నారు.


