← Back to news

ఓవర్‌స్పీడ్‌తో యువకుడు మృతి.. పైప్‌లైన్‌కు భారీ డ్యామేజ్!

By Mahesh· 2h ago· Telanganatoday· హైదరాబాద్

TG: హైదరాబాద్‌లోని నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. స్పీడ్‌గా వెళ్తున్న కారు కృష్ణా వాటర్ పైప్‌లైన్ ఎయిర్ వాల్వ్‌ను ఢీకొట్టడంతో హయత్‌నగర్‌కు చెందిన 24 ఏళ్ల వినీత్ మృతి చెందాడు. పైప్‌లైన్ డ్యామేజ్ కావడంతో 30 అడుగులకు పైగా నీరు ఎగసిపడి, వేల లీటర్ల నీరు వృథాగా రోడ్డుపైకి చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్‌తో పాటు సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వాటర్ సప్లై ఆగిపోయింది. అధికారులు వెంటనే రిపేర్ వర్క్ స్టార్ట్ చేశారు.

More in TG