← Back to news

108, 102 సిబ్బందికి అధికారుల వార్నింగ్

By Shirisha· 24 Aug 2026· కొందుర్గు
108, 102 సిబ్బందికి అధికారుల వార్నింగ్

రంగారెడ్డి జిల్లా కొందుర్గు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోని 102, 108 అంబులెన్స్‌లను జిల్లా వైద్య సేవల అధికారులు రాజబాబు, జాన్ షాహిద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఈ తనిఖీలు చేశారు. వాహనాల్లో ఆక్సిజన్, మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా చెక్ చేశారు. పేషెంట్లకు ఏమాత్రం లేట్ అవ్వకుండా, అంబులెన్స్‌లను 24/7 అందుబాటులో ఉంచాలని స్టాఫ్‌కి ఆదేశించారు.

More in Local