4 రోజులుగా చీకటిలో అమీన్‌పూర్

TG : అమీన్‌పూర్ పరిధిలోని భవానీపురం NSL ఫేజ్-2లో గత నాలుగు రోజులుగా street lights వెలగడం లేదు. ఇక్కడ పనిచేసే పాత లైన్‌మెన్ వేరే ప్రాంతానికి బదిలీ కాగా, కొత్తగా వచ్చిన లైన్‌మెన్లు నాలుగు రోజులుగా లైట్లు వేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. చీకటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి స్ట్రీట్ లైట్లను వెలిగించాలని జనం కోరుతున్నారు.




