ప్రభుత్వ స్కూళ్లకు బేసిక్ స్టాండర్డ్స్ ఉండాలి: ఆకునూరి

TG: ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు, Basic Standards ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్, విద్యాకమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. ఒక స్కూల్‌కు అవసరమైన 52 అంశాలు ఉండేలా కొత్త స్కూళ్లు నిర్మించడంతోపాటు ఉన్నవాటిని కూడా అదే స్థాయికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్ల స్టాండర్డ్స్ మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని అన్నారు. ప్రస్తుతం చాలా ప్రభుత్వ స్కూళ్లు కనీస ప్రమాణాలకు కూడా సరిపోవడం లేదని ఆయన పేర్కొన్నారు.



