మంత్రి పొంగులేటి టూర్ క్యాన్సిల్
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు, కాకరవాయి గ్రామాల్లో ఆదివారం జరగాల్సిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన రద్దయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటనను రద్దు చేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి, మంత్రి తదుపరి పర్యటన షెడ్యూల్ వచ్చే వరకు సహకరించాలని కోరారు.



