ప్రతీ నలుగురిలో ఒకరికి కిడ్నీ వ్యాధి!

AP: శ్రీకాకుళం జిల్లా, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులపై ICMR ఎక్స్‌పర్ట్స్ చేస్తున్న స్టడీలో సంచలన విషయాలు తెలిశాయి. 4 మండలాల్లో 3,897 మందికి పరీక్షలు చేయగా, 949 మందికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు తేలింది. అంటే దాదాపు నలుగురిలో ఒకరికి కిడ్నీ ముప్పు ఉంది. బాధితుల్లో 550 మందికి CKD ఉండగా, 399 మందికి కారణం తెలియని కిడ్నీ వ్యాధి - CKDU ఉంది. వైద్యపరమైన కారణాలే కాకుండా మట్టి, నీరు, పురుగుమందుల వాడకం, వ్యవసాయం, జీవనశైలి వంటి అంశాలపై ICMR టీమ్ లోతుగా అధ్యయనం చేస్తోంది.


