పిల్లల పెంపకంలో మారుతున్న పేరెంట్స్ స్టైల్

ఇండియాలో పేరెంటింగ్ స్టైల్ మారుతోంది. తాజా యూగవ్-మింట్-సీపీఆర్ సర్వేలో 21 శాతం మంది మాత్రమే తమ పేరెంట్స్ ఫాలో అయిన పద్ధతినే పాటిస్తున్నట్లు చెప్పారు. మిగతా 75 శాతం మంది పిల్లలను స్ట్రిక్ట్‌గా కాకుండా సాఫ్ట్‌గా పెంచాలని కోరుకుంటున్నారు. చదువుతో పాటు ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. పిల్లల స్క్రీన్ టైమ్, సోషల్ మీడియాలోని కంటెంట్ పేరెంట్స్‌ను ఎక్కువగా టెన్షన్ పెడుతున్నాయి.



