← Back to news

పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక పూజలు

By Naresh Kumar· 4h ago· Vikarabad
పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక పూజలు

విజయదశమి సందర్భంగా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ విఠల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని, ప్రజలంతా పండుగను ప్రశాంతంగా, ఐక్యతతో జరుపుకోవాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో జమిందార్ లోక్య నాయక్, అనిల్, నర్సింలు, ఫెరోస్ తదితరులు పాల్గొన్నారు.

More in Local