ఈసీపై మనోజ్ ఝా సీరియస్ కామెంట్స్ !
ఈసీ–SIR వివాదంపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా రియాక్ట్ అయ్యారు. గత 10 నెలల్లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు 14 సార్లు రాతపూర్వకంగా అబ్జెక్షన్స్ తెలిపారన్న రిపోర్ట్‌ను ఆయన ప్రస్తావించారు. Form 6, ECI Net, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై వచ్చిన అభ్యంతరాలను EC స్పష్టంగా వివరించాలని అన్నారు. EC ఇచ్చిన తాజా ప్రెస్ నోట్‌లో సరైన సమాధానాలు లేవని విమర్శించారు. ఈ పరిణామాలు EC క్రెడిబిలిటీపై ప్రశ్నలు పెంచుతున్నాయని అన్నారు.


