← Back to news

గడ్డకట్టే చలిలో నీటి అడుగున యోగాసనాలు

By డీకే· 21 Jun 2026· Dishadaily

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లద్దాఖ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉప్పునీటి సరస్సు పాంగాంగ్ త్సో తీరంలో గడ్డకట్టే చలిని లెక్క చేయకుండా 47వ ITBP బెటాలియన్ జవాన్లు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ, మంచు కొండల మధ్య జవాన్లు అత్యంత కఠినమైన యోగాసనాలను అలవోకగా వేసి తమ శారీరక, మానసిక దృఢత్వాన్ని చాటుకున్నారు. మరోవైపు, ఇండియన్ నేవీ సబ్‌మెరైనర్లు సముద్ర గర్భంలో జలాంతర్గాములపై వినూత్నంగా యోగాసనాలు వేశారు.

More in Viral

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!
Viral· 2d ago

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!

ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో సందడి చేశారు. కోజికోడ్‌లో ఓ జ్యువెల్లరీ ఈవెంట్‌కు వచ్చిన ఆమె.. ఆ తర్వాత కేరళం CM వి.డి. సతీశన్‌ను కలిశారు. ఇక్కడ రొనాల్డోకు భారీ ఫ్యాన్ బేస్ ఉందని CM చెప్పగా, ఈ విషయం తనకు తెలియదని ఎల్మా అన్నారు. ఈ విషయాన్ని రొనాల్డోతో చెబుతానని చెప్పారు. చివర్లో ‘CM సార్.. ఒక్క ఫొటో ప్లీజ్’ అంటూ ఫొటో అడగడంతో ఈ మూమెంట్ వైరల్‌గా మారింది. తరువాత CMతో దిగిన ఫొటోలను ఎల్మా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. <a href="https://x.com/vdsatheesan/status/2095026237718806895?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2095026237718806895%7Ctwgr%5E0150c68c6d23d9ff94230cf5dcecf2cd9b6551b7%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fcristiano-ronaldos-sister-elma-visits-kerala-smr-1554789.html">వీడియో లింక్</a>

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!
Viral· 3d ago

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!

జర్మనీలో ఫుల్ రష్‌గా ఉన్న ఓ రైల్లో కొందరు గుజరాతి ఇండియన్ టూరిస్టులు గట్టిగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యూజర్ ఈ వీడియోను <a href="https://x.com/Amit24TD/status/2094429195527196793?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2094429195527196793%7Ctwgr%5Ea95b9a92608886003674bc8a8ac30d78b1151367%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fprathyekam%2Fgermany-train-viral-video-indian-tourists-singing-clapping-sparks-outrage-bsb-1554431.html">'ఎక్స్‌'లో</a> పోస్ట్ చేశారు. రైల్లోని ఇతర టూరిస్టులను సైలెంట్‌గా ఉండగా.. ఇండియన్స్ చేసిన హంగామాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విదేశాల్లో ఇలాంటి వారి బిహేవియర్‌తో ఇండియన్ టూరిస్టులపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని కామెంట్లు చేస్తున్నారు.