← Back to news

డేవిడ్ వార్నర్ అరెస్ట్ !

By DS· 7 Apr 2026· Telugu Report· visakhapatnam
డేవిడ్ వార్నర్ అరెస్ట్ !

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ అరెస్ట్ అయ్యాడు.సిడ్నీలోని మారుబ్రాలో మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుబడ్డాడు.మరుబ్రాలోని మలబారు రోడ్డులో పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్నప్పుడు వార్నర్ దొరికి పోయాడు.పోలీసులను దూరం నుంచే చూసిన వార్నర్ రోడ్డుపక్కన కారు ఆపేందుకు ట్రై చేయగా పోలీసులు పట్టుకుని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. పరీక్షల్లో మద్యం సేవించినట్లు తేలడంతో అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత కోర్టుకు హాజరు కమ్మని ఆదేశించి వదిలిపెట్టారు. వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్- 2026లో కరాచీ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నాడు.

More in Sports