గద్వాలలో MSF నూతన కమిటీ ఎన్నిక

TG: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలికల కళాశాల హాస్టల్‌లో ఆదివారం మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (MSF) నూతన కమిటీని ఎన్నుకున్నారు. ముఖ్య అతిథి సందే కార్తీక్ మాదిగ మాట్లాడుతూ అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఐక్యంగా ఉండి ఉన్నత విద్యతో పాటు సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నూతన కమిటీ అధ్యక్షురాలిగా చైతన్య, ఉపాధ్యక్షురాలిగా స్వప్న, ప్రధాన కార్యదర్శిగా స్పందన ఎన్నికయ్యారు.



