← Back to news

రిజర్వేషన్లు కొనసాగాలి.. అదే మా స్టాండ్: ABVP

By Anusha· 21h ago

దేశంలో రిజర్వేషన్లు అవసరమేనని విద్యార్థి సంస్థ ABVP స్పష్టం చేసింది. సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సింగ్ సోలంకీ PTIతో మాట్లాడుతూ రాజ్యాంగంలో రిజర్వేషన్లకు అవకాశం ఉందని, అవి కొనసాగాలని అన్నారు. రిజర్వేషన్లు తొలగించాలని కోరేవారు ముందుగా ఈ అంశంపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందరూ కలిసి ముందుకు సాగాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రభుత్వం ఏ పార్టీదైనా విద్యార్థుల సమస్యలపై ABVP గట్టిగా పోరాడుతుందని తెలిపారు.

More in National