వాహనదారుల ఇబ్బందులు..రోడ్డా? చెరువా?
ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్లే రోడ్డుపై మంచుగోండ వద్ద పరిస్థితి అధ్వానంగా తయారైందని స్థానికులు, వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై భారీగా నీరు చేరి చెరువులా మారింది. గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు తిరిగే ఈ రోడ్డుని అధికారులు వెంటనే పరిశీలించి, గుంతలను పూడ్చి రోడ్డు బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.



