మహిళా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కావాలి

AP: మహిళా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సబ్సిడీ రుణాలతో ఆటోలు అందించాలని తిరుపతి జిల్లా సీఐటీయూ ఆటో యూనియన్ నూతన జిల్లా సహాయ కార్యదర్శి పి. దీప డిమాండ్ చేశారు. పుత్తూరులో జరిగిన ఆటో యూనియన్ సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. రేణిగుంట మండలానికి చెందిన పి. దీపను జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అనేక మంది మహిళలు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.




