చదువు ఆగిపోయిన వారికి మంచి ఛాన్స్

AP : చదువు మధ్యలోనే ఆగిపోయిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పూర్తి చేసే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) కల్పిస్తోంది. అనంతగిరిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల-2 లో ఉన్న దూర విద్యా కేంద్రంలో OSSC 10వ తరగతి అడ్మిషన్లు జరుగుతున్నాయని HM మంగమ్మ తెలిపారు. 15 ఏళ్లు నిండి, ఏవైనా కారణాల వల్ల పదో తరగతి చదవలేకపోయిన వాళ్లు HM ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. వివరాల కోసం 6305971317 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.



