జాతీయ సమగ్రతా క్యాంప్కు అరకు విద్యార్థుల ఎంపిక

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఒలుగు శివప్రసాద్, సీసా కామేశ్వరరావు జాతీయ స్థాయి క్యాంప్కు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అక్టోబర్ 15 నుంచి 21 వరకు జరిగే వందేమాతరం జాతీయ సమగ్రతా శిబిరంలో వీరు పాల్గొననున్నారు. గిరిజన ప్రాంత విద్యార్థులు జాతీయస్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. కేశవరావు తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయలక్ష్మీ విద్యార్థులను అభినందించారు.


