← Back to news

రామగుండం కార్పొరేషన్ అవినీతిపై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు

By DK· 2d ago
రామగుండం కార్పొరేషన్ అవినీతిపై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు

TG: పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలపై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేసినట్లు సీపీఐ నాయకులు మార్కపురి సూర్య, కనకరాజ్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. కార్పొరేషన్‌కు వచ్చిన రూ.16 కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులను అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మళ్లించి, టెండర్లు నిర్వహించకుండా ఏడుగురు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని ఆరోపించారు. రూ.75-77 కోట్లలో పూర్తయ్యే పనులకు రూ.99 కోట్లకు టెండర్ ఖరారు చేసి సుమారు 22శాతం నిధుల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.

More in Local