NHM ఉద్యోగాలకు నోటిఫికేషన్

కరీంనగర్ జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు DMHO రాజగోపాల్రావు తెలిపారు. మెరిట్, రోస్టర్ విధానం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2018 స్థానిక నియమాల ప్రకారం నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు విద్యార్హతలు, కుల ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయంలో నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమర్పించవచ్చన్నారు. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 24న ఉదయం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు.



