80 లక్షలు దాటిన HPV ఉచిత టీకాల సంఖ్య

దేశంలో 14 ఏళ్ల బాలికలకు ఇస్తున్న ఉచిత HPV టీకా 80 లక్షల డోసులను దాటింది. ఈ టీకా వల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 2026 ఫిబ్రవరి 28న అజ్మీర్‌లో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రుల అనుమతితో బాలికలకు టీకా ఇస్తారు. ఈ టీకా ఉచితమే. టీకా తీసుకోవడం పూర్తిగా వారి ఇష్టమే. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మిజోరం రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా బాలికలు టీకా తీసుకున్నారు.



