కారుతో మహిళా బైకర్‌పై దాడి

హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లో బైక్ నడుపుతున్న ఒక యువతిని వెనుక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. కారులో ఉన్నవారు మద్యం మత్తులో తనను వెంబడిస్తూ వేధించారని, పక్కకు వెళ్లమని చెప్పినా వినకుండా కావాలనే కారుతో గుద్దేశారని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనలో ఆమె రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఘటన మొత్తం ఆమె కెమెరాలో రికార్డు కావడంతో వీడియో వైరల్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ కోసం వెతుకుతున్నారు.



