రేబిస్ డెత్ డేటాలో షాకింగ్ తేడా!

రేబిస్ మరణాల లెక్కల్లో భారీ తేడా కనిపిస్తోంది. భారత్‌లో రేబిస్ మరణాలపై స్పష్టమైన గణాంకాలు లేవు. 2023లో 50 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతుండగా.. Registrar-General డేటాలో 271 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ICMR-NIE అధ్యయనం ప్రకారం దేశంలో ఏటా 5,726 మంది రేబిస్‌తో చనిపోతున్నట్లు అంచనా. సరైన డేటా నమోదు కాకపోవడమే ఈ తేడాకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలన్న భారత్ లక్ష్యానికి ఇది పెద్ద సవాలుగా మారింది.



