ఏటా 700 కోట్ల కోడిపిల్లల హత్య!

గుడ్లు పెట్టవనే కారణంతో ఏటా 700 కోట్ల మగ కోడిపిల్లలను గ్రైండింగ్, కాల్చడం, నీళ్లలో ముంచడం వంటి పద్ధతులతో చంపేస్తున్నారు. ఈ హింసను ఆపేందుకు ‘ఇన్-ఓవో సెక్సింగ్’ టెక్నాలజీని అమలు చేయాలని మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ కోరుతోంది. గుడ్డు పొదిగే దశలోనే పిండం ఆడదా, మగదా గుర్తించే ఈ టెక్నాలజీని భారత్‌లోనూ అందుబాటులోకి తేవాలని ప్రచారం చేస్తోంది. వరల్డ్ ఎగ్ డే సందర్భంగా హైదరాబాద్‌లో మిక్సీలో కోడిపిల్ల చిక్కుకున్నట్టుగా బొమ్మను ఏర్పాటు చేసి, జంతు హింసకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.


