← Back to news

బోధన్‌లో 4 వేల మట్టి వినాయకుల పంపిణీ

By DK· 1d ago
బోధన్‌లో 4 వేల మట్టి వినాయకుల పంపిణీ

TG: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని బోధన్ ఆర్డీఓ విజయకుమారి, ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ రాకాసిపేట్, లయన్స్ క్లబ్ ఆఫ్ భవాని ఆధ్వర్యంలో సుమారు 4 వేల మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆర్డీఓ విజయకుమారి, ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. రంగులతో కూడిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, కుంటల్లోని నీరు కలుషితమై చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడే అవకాశం ఉందన్నారు.

More in Local