ప్రజల్లో భయం కాదు.. భరోసా కల్పించాలి: హోంమంత్రి

గుంటూరు జిల్లా మంగళగిరిలోని AP Police 6వ బెటాలియన్‌లో 149 మంది 2025–26 బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వాన్ని పాటించాలని సూచించారు. ప్రజల్లో భయం కాకుండా భరోసా కలిగించేలా సేవలందించాలని, సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవాలని నూతన కానిస్టేబుళ్లకు సూచించారు.



