వంట మనిషిని నమ్మి వెళ్లిన విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన
AP : ప్రకాశం జిల్లా జరుగుమల్లి KGVB హాస్టల్ వంట మనిషి విద్యార్థినులను మభ్యపెట్టి, ఒంగోలులోని రిటైర్డ్ DRDA ఉద్యోగి వెంకట్రావు ఇంటికి తీసుకెళ్లి అప్పగించింది. అతడు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించడంతో, భయపడిన స్టూడెంట్స్ బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పారు. స్థానికులు, తల్లిదండ్రులు నిందితుడి ఇంటిపై దాడి చేయగా, పోలీసులు అక్కడికి చేరుకుని వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు.



