వారికి తల్లికి వందనం.. ఇంకెప్పుడు?

AP: ఈ ఏడాది తల్లికి వందనం రెండో విడత డబ్బుల కోసం సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇందులో కొత్తగా 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారితో పాటు, రికార్డుల సవరణ వల్ల తొలి విడతలో లబ్ధి పొందని వారున్నారు. ఆగస్టు 30న డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా.. ఇంకా డిపాజిట్ కాలేదు. రెండో విడత ఫైలుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, CM Office ఆమోదం తర్వాత ఒక్కో విద్యార్థికీ 13 వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు.



