ఫోన్ ట్యాపింగ్ కేసులో యుగతులసి ఛైర్మన్ కు నోటీసులు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో మరోసారి సాక్షులను విచారించాలని నిర్ణయించారు. యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ , టి.టి.డి మాజీ సభ్యులు కె. శివకుమార్ కు సిట్ నోటీసులిచ్చింది. మే 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనుంది.


