ఢిల్లీ పోలీసుల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు అభిజిత్ దీప్కే ప్లాన్!
సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా తరలించినా, జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. యువత గొంతు నొక్కేందుకు ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున క్రాక్‌డౌన్‌కు ప్లాన్ చేస్తున్నట్లు అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసుల చర్యలను అడ్డుకునేందుకు అందరూ తరలివచ్చి రాత్రిపూట కాపలా ఉండాలని పిలుపునిచ్చారు. జూలై 20న జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వైపు చేపట్టే శాంతియుత మార్చ్‌ను విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో తరలిరావాలని అభిజిత్ పిలుపునిచ్చారు.


