గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి, కాంగ్రెస్ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ రెడ్డిని గెలిపించాలని సూచించారు.


